ప్లాన్ బి: ‘టాక్సిక్’తో పోయింది ‘రామాయణ’తో వస్తుందా?

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’ ఎంతో ఆలస్యం అవుతూ వచ్చినప్పటికీ ఈ సినిమా అంచనాలు ఏమాత్రం తగ్గకుండా భారీ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. కానీ సీన్ కట్ చేస్తే కంటెంట్ ఏమో ఆ హైప్ ని మ్యాచ్ చేయలేక చతికిలపడింది. ముఖ్యంగా మన తెలుగులో టాక్సిక్ పై ఎఫెక్ట్ బాగా కనిపించింది.

అయితే ఈ సినిమాని పాపులర్ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ నెంబర్ రివీల్ చేయకపోయినా భారీ నెంబర్ తోనే తాను ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్నారు. కానీ ఈ సినిమా డే 1 నుంచే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో దిల్ రాజుకి నష్టాలు తప్పవు అనే రూమర్స్ మొదలయ్యాయి.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే టాక్సిక్ కి నిజంగానే నష్టాలు వచ్చినా ఇదే సినిమా నిర్మాణంలో భాగం అయ్యిన యష్ నుంచి తన నెక్స్ట్ సినిమా ‘రామాయణ’ హక్కులు దిల్ రాజుకి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇలా ప్లాన్ బి కూడా దిల్ రాజు చేతుల్లో ఉందట. రామాయణ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాలో కూడా యష్ నటించడమే కాకుండా నిర్మాతగా కూడా చేసాడు. సో టాక్సిక్ తో పోయింది అక్కడ దిల్ రాజుకి రికవర్ అయ్యే ఛాన్స్ ఉందట. మరి దీనిపై మరిన్ని వివరాలు బయటకి రావాల్సి ఉంది.

Exit mobile version