ఎన్టీఆర్ అవకాశాన్ని ఉప్పెన డైరెక్టర్ మిస్ చేసుకున్నాడా?

ఎన్టీఆర్ అవకాశాన్ని ఉప్పెన డైరెక్టర్ మిస్ చేసుకున్నాడా?

Published on Nov 17, 2022 12:49 AM IST


లెక్కల మాస్టర్, డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా చేసిన బుచ్చిబాబు సన తొలి చిత్రం ఉప్పెన తోనే తెలుగు సినీ పరిశ్రమ లో మంచి హిట్ కొట్టాడు. ఈ చిత్రం రిలీజై రెండేళ్లు అవుతున్నా, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. ఈ డైరెక్టర్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవడం లో విఫలం అయినట్లు తెలుస్తోంది.

ఇంకా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయాకపోవడం పట్ల డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఎవరితో ప్లాన్ చేస్తారు అనే దాని పై ఆసక్తి నెలకొంది. అయితే మాస్ ఆడియెన్స్ ను ఫుల్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా స్క్రిప్ట్ రెండేళ్లు గా వర్క్ చేస్తూనే ఉన్నాడు. మరి బుచ్చిబాబు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏమవుతుందో చూడాలి. ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ ను డైరెక్టర్ కొరటాల శివ తో చేయనున్నారు. ఈ చిత్రం తో పాటుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు