టాక్..”డీజే టిల్లు” రీమేక్ కి సన్నాహాలు.?

Published on Dec 14, 2022 8:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటుడుగా టాలీవుడ్ లో తన కెరీర్ స్టార్ట్ చేసి ఈ ఏడాది “డీజే టిల్లు” తో అయితే తన కెరీర్ లో మంచి బ్రేక్ అందుకొని నెక్స్ట్ సినిమాలపై మంచి అంచనాలు అయితే రాబట్టుకోగలిగాడు. దీనితో నెక్స్ట్ తెరకెక్కిస్తున్న టిల్లు స్క్వేర్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదంతా బాగానే ఉండగా ఇప్పుడు డీజే టిల్లు రీమేక్ కి అయితే సన్నాహాలు స్టార్ట్ కానున్నట్టుగా బజ్ వినిపిస్తుంది.

మరి ఈ చిత్రాన్ని అయితే బాలీవుడ్ వర్గాలు రీమేక్ చేయాలని చూస్తున్నారట. మరి దీనిని ఏ బ్యానర్ వారు తీసుకున్నారు, హీరోగా ఎవరు కనిపిస్తారు అనేవి ఇంకా క్లారిటీ రాలేదు కానీ రీమేక్ చేసే ఛాన్స్ లు ఉన్నట్టుగా సినీ వర్గాల్లో బజ్ అయితే ఇప్పుడు బయటకి వచ్చింది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక తెలుగు లో అయితే పార్ట్ 2 షూట్ శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది వేసవి కానుకగా టిల్లు క్రేజీ రైడ్ స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :