“ఎఫ్ 3” కీలకమైన మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Published on May 31, 2022 9:00 am IST


టాలీవుడ్ లో ఉన్న ఇప్పటి డైరెక్టర్స్ లో వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకునిగా అనిల్ రావిపూడి తన హిట్స్ పరంపర ని కొనసాగిస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా తాను తెరకెక్కించిన చిత్రం “ఎఫ్ 3” తో తన ఖాతాలో మరో హిట్ ని వేసుకున్నాడు. విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా అనుకున్నట్టుగానే మొదటి రోజు నుంచే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది.

అయితే ఇది మొత్తం వీకెండ్ వరకు పర్వాలేదు కానీ అసలు సిసలైన వర్కింగ్ డే మండే టెస్ట్ పరిస్థితి ఎలా ఉంటుందా అని టాక్ మొదలైంది. అయితే దీనికి కూడా ఈ సమ్మర్ సోగ్గాళ్లు సాలిడ్ ఆన్సర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మ్యాట్నీ షో నుంచి ప్రేక్షకులు క్యూ లు కడుతుండగా అనేక చోట్ల షోలు అన్నీ ఫుల్ అవుతున్నాయి. మొత్తానికి అయితే మళ్ళీ అనీల్ రావిపూడి తన మార్క్ విజయాన్ని సొంతం చేసేసుకున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం :