లేటెస్ట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మావెరిక్ దర్శకుడు శంకర్ కలయికలో వచ్చిన చిత్రం “గేమ్ ఛేంజర్” కూడా ఒకటి. మరి ఇండియన్ సినిమా దగ్గర టాప్ మోస్ట్ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే దర్శకుడు శంకర్ తో వర్క్ చేసిన ఏకైక హీరోగా గ్లోబల్ స్టార్ నిలవడంతో గేమ్ ఛేంజర్ అనేది మెగా అభిమానులకి మరింత స్పెషల్ గా మారింది.
చాలా మంది చాలా రకాలుగా ఈ సినిమా కోసం ఆశించారు కానీ వాటిని పూర్తి స్థాయిలో ఈ సినిమా అందుకోలేకపోయింది అనే మాట కూడా ఈ చిత్రంపై ఉంది. అయితే శంకర్ అంటేనే ఒక కొత్తదనం, నిండుదనం. సాలిడ్ మెసేజ్ ని పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ దట్టించి ట్రెండీగా అందించడంలో శంకర్ దిట్ట. అలానే తన సినిమాలు టైటిల్ కార్డ్స్ నుంచి ప్రతీ చిన్న అంశంలో కూడా శంకర్ చూపించే క్రియేటివిటీ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే ఈ మధ్య కాలంలో ఒక హీరోకి కానీ సినిమాలో టైటిల్ కార్డ్స్ కి కూడా కొత్త కొత్తగా మేకర్స్ చూపిస్తూ ఆడియెన్స్ కి థియేటర్స్ లో సాలిడ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నారు. ఇలానే గేమ్ ఛేంజర్ కి కూడా రామ్ చరణ్ పేరుకి అలాగే సినిమా టైటిల్స్ కి కూడా సెపరేట్ టైటిల్ కార్డ్స్ వేస్తారని అనుకుంటే సినిమాలో ఎప్పుడో రామ్ చరణ్ బర్త్ డే కి అనౌన్స్ చేసిన టైటిల్ కార్డ్ తో సరిపెట్టేసి బాగా డిజప్పాయింట్ చేశారు.
పోనీ టైటిల్ కార్డ్స్ లో అయినా ఒక 2.0 రేంజ్ ఏమన్నా అనుకుంటే దీనిని ఇంకా సింపుల్ గా చూపించారు. అయితే శంకర్ ఈ సినిమాకి ఏకంగా 5 గంటల ఫుటేజ్ చేశామని చెప్పారు. మరి ఇందులో శంకర్ మార్క్ స్పెషల్ టైటిల్ కార్డ్స్ కూడా ఉన్నాయా అంటే దానికి అవుననే చెప్పవచ్చు. ఇందుకు యూఎస్ ఈవెంట్ వరకు వెళ్లాల్సి ఉంది. ఏ ఇండియన్ సినిమాకి లేని విధంగా యూఎస్ లో గ్రాండ్ ఈవెంట్ చేసి సక్సెస్ అయ్యారు.
అయితే ఈ ఈవెంట్ లో చూసినట్టు అయితే బ్యాక్గ్రౌండ్ లో సినిమాకి తగ్గట్టుగా చెస్ పావులు చాలా యూనిక్ డిజైన్ లో కనిపిస్తాయి. చదరంగంలో కనిపించే భటుడు నుంచి రాజు పావు వరకు ఒక స్టైలిష్ డిజైన్ కనిపిస్తాయి. మరి ఈ స్టైల్ లోనే శంకర్ సినిమా కోసం టైటిల్ కార్డ్స్ ని డిజైన్ చేయించి ఉండొచ్చు. అందులో పక్కాగా శంకర్ మార్క్ కనిపిస్తుంది. మరి ఇలాంటి వాటిని కూడా పక్కన పెట్టేసి సినిమా రిలీజ్ చేసారా అనేది ఇపుడు మరో ప్రశ్న అని చెప్పవచ్చు.
ఇదే ఈవెంట్ లో తాము సినిమాని అందరికీ కనెక్ట్ అయ్యేలా షార్ప్ రన్ టైం తో తీసుకొస్తున్నామని చెప్పారు. మరి ఇలా ఆ టైటిల్ కార్డ్స్ కూడా అవసరం లేదనుకున్నారో ఏమో కానీ ఒకవేళ అవి కూడా ఉండుంటే ఆడియెన్స్ కి మంచి ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ని మిస్ చేసినవారే అని చెప్పక తప్పదు. మరి ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ ఎఫెక్ట్ మాత్రం సినిమా రిజల్ట్ మీదే పడింది.