టాక్..”హరిహర వీరమల్లు” బడ్జెట్ పెరిగిందా.?

Published on May 22, 2022 3:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా కం మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఇది తెరకెక్కుతుంది. మరి దీనితో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ భారీ పీరియాడిక్ చిత్రం ని ఎక్కడా తగ్గకుండా ఎక్కువ బడ్జెట్ తోనే ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా ఓ టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు మరింత పెరిగినట్టు తెలుస్తుంది. మొదట్లో ఈ సినిమాని 150 నుంచి 180 కోట్ల లోపు ప్లాన్ చెయ్యగా ఇప్పుడు ఇది 200 కోట్లకి వెళ్లినట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో చాలా వరకు సెట్ వర్క్స్ మరియు గ్రాఫిక్స్ కే ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా అవుట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :