మెగా హీరోతో హరీష్ శంకర్ మరో సినిమా ప్లానింగ్ ?

మెగా హీరోతో హరీష్ శంకర్ మరో సినిమా ప్లానింగ్ ?

Published on Oct 30, 2022 7:36 PM IST


డైరెక్టర్ హరీష్ శంకర్ వరుణ్ తేజ్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కి హరీష్ శంకర్ ఓ కథ చెప్పాడని, వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే, ఈ సినిమాని బండ్ల గణేశ్ నిర్మిస్తున్నారని, ఇది ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

మరి వరుణ్ తేజ్ కోసం హరీష్ శంకర్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు. మరీ ఈ సినిమా అయిపోయాక, తన తర్వాత సినిమాని హరీష్ శంకర్, వరుణ్ తేజ్ తో చేస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా హరీష్ శంకర్ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు