సల్మాన్ ఖాన్ తో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సినిమా ?

సల్మాన్ ఖాన్ తో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సినిమా ?

Published on Nov 13, 2022 7:48 PM IST


డైరెక్టర్ హరీష్ శంకర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ కి హరీష్ శంకర్ ఓ కథ చెప్పాడని, సల్మాన్ ఖాన్ కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని ఓ రూమర్ వైరల్ గా మారింది. మరి ఈ రూమర్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు.

నిజానికి హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించడానికి ఎదురుచూస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ కోసం హరీష్ శంకర్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన తర్వాత సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తాడట. ఏది ఏమైనా హరీష్ శంకర్ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు