కమ్ముల “లీడర్ 2” కి హీరో దొరికేసాడా.?

Published on Apr 27, 2022 1:20 pm IST


మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఉండే రేటెడ్ స్టార్ దర్శకుల్లో శీకార్ కమ్ముల కూడా ఒకరు, తనదైన సినిమాలతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే శేఖర్ కమ్ముల లేటెస్ట్ గా “లవ్ స్టోరీ” సినిమాతో హిట్ కొట్టారు. ఇక దీని తర్వాత మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్స్ తాను చెయ్యనున్నారు. మరి వీటిలో తన కెరీర్ లో ఒక బెస్ట్ వర్క్ అయినటువంటి “లీడర్” సినిమాకి కూడా సీక్వెల్ ఒకటి.

మొదటి సినిమా రానా దగ్గుబాటి తో తీయగా దీని సీక్వెల్ కోసం ఎపుడు నుంచో ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సీక్వెల్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాకి గాను శేఖర్ కమ్ముల తమిళ స్టార్ హీరో సూర్య పేరును పరిశీలిస్తున్నారట. అయితే సూర్య పేరు కూడా ఒక మంచి ఛాయిస్ అని చెప్పాలి. కాకపోతే ఇందులో ఎంతమేర నిజముందో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అనేవి తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :