టాక్..”రాధే శ్యామ్” హిందీ రన్ టైం లాక్ అయ్యిందా?

Published on Feb 5, 2022 11:00 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఒక పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సినిమాగా తీసుకొస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే అన్ని భాషల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకొంటూ ఈ సినిమాని తెరకెక్కించారు.

ముఖ్యంగా మన తెలుగు మరియు హిందీ వెర్షన్ల కి ముందు నుంచి కీలక వేరియేషన్ లను చూపిస్తూ వచ్చారు. అలాగే హిందీ పాటలు గాని తెలుగు పాటలు కానీ కంప్లీట్ గా ఆరెండు ఆల్బమ్స్ ని చేసి మరింత ఆసక్తి కూడా రేపారు. అయితే ఇదిలా ఉండగా ఆ మధ్య ఈ సినిమా పాటల విషయంలోనే కాకుండా సినిమా రన్ టైం కూడా తెలుగుకి హిందీకి చాలా తేడా ఉంటుందని తెలిసింది.

ఇప్పుడు మరి హిందీ వెర్షన్ తాలూకా రన్ టైం వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాకి గాను హిందీలో 2 గంటల 31 నిమిషాల నిడివి లాక్ అయ్యిందట. ఇది అయితే డీసెంట్ రన్ టైం అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రం అయితే ప్రపంచ వ్యాప్తంగా వచ్చే మార్చ్ 11న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :