ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న “కింగ్ ఆఫ్ కొత్త”?

Published on Sep 17, 2023 1:00 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “కింగ్ ఆఫ్ కొత్త” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం దుల్కర్ కెరీర్ లో భారీ చిత్రంగా తెరకెక్కించారు. మరి ఈ చిత్రం అయితే పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయగా ఇది మాత్రం అనుకున్న రేంజ్ రెస్పాన్స్ ని అందుకోలేక విఫలం అయ్యింది. మరి ఈ చిత్రాన్ని దర్శకుడు అభిలాష్ జోషి తెరకెక్కించగా ఫైనల్ గా అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో అయితే ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా దుల్కర్ సల్మాన్, జీ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :