టాక్..”సర్కారు వారి పాట” అప్పటికి వాయిదా పడిందా?

Published on Jan 12, 2022 3:01 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఆల్రెడీ 90 శాతం వరకు కంప్లీట్ చేసేసారు.

మరి కొన్ని పరిస్థితులు రీత్యా ఈ చిత్రం సంక్రాంతి నుంచి ఏప్రిల్ 1 కి షిఫ్ట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ మరోపక్క మరికొన్ని ఊహించని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ నుంచి కూడా షిఫ్ట్ అయ్యిందని అంటున్నారు. ఈసారి ఏకంగా ఆగష్టు నెలకి రిలీజ్ వెళ్లిందని అంటున్నారు.

అయితే ఇంకా ఇందులో ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ సినీ వర్గాల్లో అయితే ఈ టాక్ ఇప్పుడు బయటకొచ్చింది. మరి వేచి చూడాలి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఎప్పుడు రిలీజ్ కి వస్తుంది అనేది. ప్రస్తుతం అయితే ఈ చిత్రం షూట్ విశాఖలో జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :