కోలీవుడ్ సినిమా నుంచి లేటెస్ట్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు చిత్రాల్లో యాక్షన్ హీరో విశాల్ అలాగే వెర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య కాంబినేషన్ లో నటించిన ఇంట్రెస్టింగ్ చిత్రం “మార్క్ ఆంటోనీ” కోసం తెలిసిందే. మరి దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ అనంతరం మంచి అంచనాలు సెట్ చేసుకుంది.
అయితే ఈ చిత్రాన్ని కూడా తెలుగు సహా కోలీవుడ్ నుంచి పలు చిత్రాలతో ఈ వినాయక చవితికి సిద్ధం చేయగా ఈ సినిమాతో ఉన్న ఇతర చిత్రాలు వాయిదా పడ్డాయి. దీనితో మార్క్ ఆంటోనీ సోలో రిలీజ్ ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఊహించని విధంగా ఇప్పుడు ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ కాబోతుంది అని రూమర్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరి దీనితో మార్క్ ఆంటోనీ కూడా వాయిదా పడుతుందో లేదో అనేది అధికారిక అప్డేట్ వస్తే తప్ప క్లారిటీ రాదు.