మెగాస్టార్ క్రేజీ ప్రాజెక్ట్ లో మాస్ మహారాజ్ కన్ఫర్మ్ అట.!

Published on Feb 10, 2022 1:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” అయితే రిలీజ్ కి కూడా రెడీగా ఉంది. ఇక దీనితో పాటుగా మరిన్ని భారీ సినిమాలు మెగాస్టార్ లైనప్ లో ఉండగా వాటిలో ఇంకో రెండు సాలిడ్ మల్టీ స్టారర్ లే ఉన్నాయని చెప్పాలి.

మరి ఈ చిత్రాల్లో దర్శకుడు కె ఎస్ రవీంద్ర(బాబీ) తెరకెక్కించనున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ కూడా ఒకటి. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాపై అయితే మెగా ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలోనే చిరు తో పాటుగా మళ్ళీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటించనున్నాడని ఆ మధ్య టాక్ వచ్చింది.

అయితే ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ తెలుస్తుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మాస్ మహారాజ్ కనిపిస్తారు అనే టాక్ నిజమేనట. తాను ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించనున్నాడని మెగా వర్గాలు చెబుతున్న మాట. కాకపోతే ఈ షూటింగ్ మొదలు కావడానికి మాత్రం కాస్త టైం పడుతుందట.

సంబంధిత సమాచారం :