తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ కుమార్తె మేధ హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ‘మైత్రీ ఇన్ లవ్’ పేరుతో రాబోతున్న ఓ క్యూట్ లవ్‌స్టోరీతో ఇండస్ట్రీకి ఆమె పరిచయం కానున్నారు. ఈ మేరకు తాజాగా సినిమా పోస్టర్‌ను టీమ్ రిలీజ్ చేసింది. జై జాస్తి, మేధ హీరో హీరోయిన్‌లుగా పరిచయమవుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ వనం దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మిస్తోంది.
‘వారితో మొదలై, మీ హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే ప్రేమకథ ఇది’ అనే క్యాప్షన్‌తో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను టీమ్ రిలీజ్ చేశారు. మరి హీరోయిన్‌గా మేధ టాలీవుడ్ లో ఎలాంటి హిట్లు అందుకుంటుందో చూడాలి. అన్నట్టు మేధకి వెండితెరకు కొత్తేం కాదు. అనుష్క ప్రధానపాత్రలో వచ్చిన ‘రుద్రమదేవి’ చిత్రంలో మేధ చిన్నప్పటి రుద్రమదేవి పాత్రలో నటించి అలరించారు. ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో ‘ఏమో ఏమో ఇది’ అనే రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌లో రోషన్ నటిస్తున్నాడు.
