మోస్ట్ అవైటింగ్ “వలిమై” టీజర్ కి డేట్ ఫిక్స్.?

Published on Sep 22, 2021 10:01 am IST


ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని ఉన్న చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “వలిమై” కూడా ఒకటి. దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. మరి ఈ భారీ చిత్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సాలిడ్ రెస్పాన్స్ కొల్లగొడుతుండగా..

అంతా ఇప్పుడు టీజర్ మ్యానియా కోసమే ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాలిడ్ టీజర్ కట్ ని మేకర్స్ వచ్చే రేపు సెప్టెంబర్ 23 గురువారం నాడు రిలీజ్ చేస్తారని బజ్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :