తారక్, త్రివిక్రమ్ ల సినిమాకు ముహూర్తం కుదిరిందా.?

NTR Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో వచ్చిన అరవింద సమేత చిత్రం ఎంత మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇంకా ఆ చిత్రంతో వీరి కాంబో నుంచి మరో సినిమా రావాలని కోరుకున్నారు. మరి ఆ టైం లోనే వీరి కాంబో నుంచి రెండో సినిమా కూడా ప్రకటించేసారు.

అక్కడ నుంచి మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రంకు “అయిననూ పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ ఈ చిత్రం ఎప్పుడు మొదలు కానుంది అన్నది ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో తార రాజమౌళితో “RRR” సినిమాలో బిజీ అయ్యిపోయాడు.

అయితే ఇక ఇదిలా ఉండగా త్రివిక్రమ్ మరియు తారక్ ల కాంబో స్టార్ట్ కాడానికి ముహూర్తం ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తాలూకా పూజా కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ ఈ సంక్రాంతికే ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆరోజు సాధారణ పూజా కార్యక్రమంను జరుపుకొని తారక్ పూర్తిగా ఫ్రీ అయ్యాక ఈ ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో పట్టాలెక్కించనున్నారు.

Exit mobile version