టాక్.. నాని “సరిపోదా శనివారం” వాయిదా?

టాక్.. నాని “సరిపోదా శనివారం” వాయిదా?

Published on Jul 9, 2024 9:00 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “సరిపోదా శనివారం”. మరి ఓ క్రేజీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంలో ఎస్ జె సూర్య సాలిడ్ రోల్ చేస్తుండగా ఈ సినిమాపై మంచి బజ్ ఆల్రెడీ అయితే ఉంది. ఇక ఎప్పటికప్పుడు మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ ని అందిస్తుండగా ఇపుడు ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 29 నుంచి కేవలం కొన్ని రోజులు వెనక్కి వెళ్లినట్టుగా టాక్. దీనితో ఈ చిత్రం ఈ సెప్టెంబర్ రెండో వారానికి మారినట్టుగా టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఇంకా వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు