టాక్..”బిగ్ బాస్” తెలుగులో అభిజీత్ ని మ్యాచ్ చేసేలా ఇంకొకరు లేరా?

Published on Dec 26, 2021 5:15 pm IST


ప్రపంచ వ్యాప్యంగా కూడా ఎంతో ఆదరణ కలిగి ఉన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. ఇది అందరికీ కూడా తెలుసు. ఇంకా చెప్పాలంటే కింగ్ నాగ్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ ప్రకారం మన తెలుగు బిగ్ బాస్ షో నే ప్రపంచంలో అధికంగా ఆదరిస్తున్నారని కూడా రివీల్ చేసారు. అంటే ఆ రేంజ్ లో బిగ్ బాస్ షో ని మన తెలుగు ఆడియెన్స్ ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఇప్పటి వరకు మొత్తం ఐదు సీజన్లు తెలుగులో కంప్లీట్ అయ్యాయి. గత ఆదివారం తోనే ఐదవ సీజన్ కూడా కంప్లీట్ కాగా దాని తర్వాత అసలు టాక్ ఇప్పటి వరకు సీజన్లను చూసిన జెనరల్ ఆడియెన్స్ లో మొదలైంది. విన్నర్స్ అనే కాన్సెప్ట్ ని పక్కన పెడితే అసలు ఈ సీజన్ కి గాని గత సీజన్ల కి గాని మేజర్ గా ఆడియెన్స్ మిస్టర్ పర్ఫెక్ట్ గా అభిజీత్ పేరుని చెబుతున్నారు.

ఈసారి మంచి క్రేజ్ తో సన్నీ గెలిచినా అభిజీత్ లాంటి క్లారిటీ ఉన్న కంటెస్టెంట్ ని ఈసారి సీజన్లో చూడలేదు అని బిగ్ బాస్ ఫాలోవర్స్ మాట. బిగ్ బాస్ హౌస్ లో తోటి కంటెస్టెంట్స్ తో క్లారిటీ మైంటైన్ చెయ్యడంలో గాని వారిని డీల్ చెయ్యడంతో కానీ ముఖ్యంగా షో ద్వారా ఇప్పటి వరకు క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ లో అభిజీత్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుందని చెప్పాలి. ఇది తన సినిమా కెరీర్ కి ఎంతవరకు ఉపయోగ పడిందో కానీ బిగ్ బాస్ షో వీక్షకుల్లో మాత్రం తనకంటూ ఒక బ్రాండ్ ని అయితే అభిజీత్ ఏర్పరచుకున్నాడు.

సంబంధిత సమాచారం :