పవన్ కోసం ఈ బ్యూటీ కూడా రంగంలోకి దిగిందా ?

పవన్ కోసం ఈ బ్యూటీ కూడా రంగంలోకి దిగిందా ?

Published on Apr 24, 2022 10:47 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. తాజా సమాచారం మేరకు వీరమల్లు సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ‘నోరా ఫతేహీ’ కూడా నటించబోతుందట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో నోరా ఫతేహీ పై ఓ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు.

ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ పార్ట్ ను తర్వాత ప్రత్యేకంగా షూట్ చేస్తారట. ఈ షెడ్యూల్ తో సినిమాలో కీలక భాగం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది.

ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు