ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు అవైటెడ్ భారీ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది.
అయితే ఈ సినిమాకి కూడా నీల్ గత సినిమా సలార్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన ఆ యాక్షన్ సినిమా పార్ట్ 1 తోనే పార్ట్ 2 కూడా షూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్ట్ 2 కొంతమేర మాత్రమే చేసారు.
ఇప్పుడు ఇదే తరహాలో ఎన్టీఆర్ తో సినిమా కూడా పార్ట్ 2 షూట్ కొంత పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.
