
ఎన్టీఆర్ తరవాతి సినిమా పూరి దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో రాబోతుందన్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే.తన కెరియర్లో మొదటిసారిగా పూరి తన సినిమాకి కధను అందిచటంలేదు.ఈ చిత్రానికి వక్కంతం వంశి కధారచయితగా వ్యవహరిస్తున్నాడు.
ఇటీవల అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకి “రుబాబు” అనే టైటిల్ ఖరారయ్యింది.ఈ విషయాన్ని చిత్ర నిర్మాణబృందం అధికారికంగా నిర్దారించాకపోయినప్పటికి ఎన్టీఆర్ స్టైల్ కి,బాడీ లాంగ్వేజ్ కి ఈ టైటిల్ అద్భుతంగా సరిపోతుంది.
ఈ చిత్రం షూటింగ్ జూన్1 న ప్రారంభించి 2015 జనవరి9 సంక్రాంతి సందర్భంగా విడుదల చెయ్యాలని భావిస్తున్నారు.పూరి,ఎన్టీఆర్ ఆఖరిసారిగా “ఆంధ్రావాలా” కి పనిచేసారు.