మరోసారి బాలయ్యతో రేస్ లో రవితేజ ఢీ..?

Published on Oct 6, 2021 7:06 am IST

ప్రపంచంలో కరోనా ఎంటర్ అవ్వడంతోనే పరిస్థితులు అన్నీ కూడా ఎలా మారిపోయాయో మనం కళ్లారా చూసాము. అయితే దాని ప్రభావం ఇంకా అనుభవిస్తున్న సంస్థ ఏదన్నా ఉంది అంటే అది సినిమా సంస్థే అని చెప్పాలి. మెల్లగా కోలుకున్నాక థియేటర్స్ స్టార్ట్ అయ్యాక తెలుగు నుంచే ఎన్నో సినిమాలు మొదటగా రిలీజ్ డేట్స్ కుప్పలుగా అనౌన్స్ చేశారు.

అదే సమయంలో మాస్ మహారాజ్ రవితేజ అలాగే నందమూరి మాస్ హీరో బాలకృష్ణ సినిమాలు “ఖిలాడి”; “అఖండ” లు మే 28 ని ఫిక్స్ అయ్యాయి. దీనితో ఈ పోటీ మంచి రసవత్తరంగా మారింది. కానీ ఆ నెల వచ్చేసరికే కరోనా రెండో వేవ్ విలయతాండవం చేసింది. దీనితో ఆ సినిమాలు అన్నీ మళ్ళీ ఆగిపోయాయి.

కానీ ఇప్పుడు మళ్ళీ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో యాదృచ్చికంగా ఈ రెండు సినిమాలు ఒకే టైం కి రావడం కన్ఫర్మ్ అన్నట్టు టాక్ మొదలైంది కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఖిలాడి ఇంకా లేట్ గానే రిలీజ్ అవ్వబోతుంది అని తెలుస్తోంది. అంతే కాకుండా రవితేజ సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే ఓ క్లారిటీ కూడా రాబోతుందట.

సంబంధిత సమాచారం :