టాక్..”టైగర్ నాగేశ్వరరావు” ఓటిటి డీల్ లాక్.?

Published on May 25, 2023 10:02 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ అండ్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “టైగర్ నాగేశ్వరరావు”. మాస్ మహారాజ రవితేజ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా చేస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు వంశీ అయితే టేకప్ చేసాడు. మరి భారీ హంగులతో అన్ని క్రాప్ట్స్ లో కూడా ఎక్కడా తగ్గకుండా అత్యున్నత ప్రామాణిక విలువలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ వచ్చిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ కి క్రేజీ రెస్పాన్స్ అయితే వచ్చింది.

ఇక ఈ భారీ ప్రాజెక్ట్ తాలూకా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ హక్కులు అయితే ప్రముఖ ఓటిటి సంస్థ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి మాస్ మహారాజ్ గత చిత్రం రావణాసుర స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసిన ప్రైమ్ వీడియో వారే ఈ సినిమాకి భారీ ధరతో స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అయితే అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :