వైరల్..ప్రభాస్, అమితాబ్ లని మీట్ అయ్యిన పవన్ కళ్యాణ్..?

Published on Feb 17, 2022 12:00 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో పలు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరి వాటిలో కొన్ని సినిమాలు ఆర్ ఎఫ్ సి(రామోజీ ఫిలిం సిటీ) లో తెరకెక్కుతున్నాయి. ఇలా షూటింగ్ జరుగుతున్న చిత్రాల్లో ఓ చిత్ర యూనిట్ మరో చిత్ర యూనిట్ తో కలిసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి చిత్రాలు “భీమ్లా నాయక్” మరియు “ప్రాజెక్ట్ కే” లు తెరకెక్కుతున్నాయి.

మరి ఈ సమయంలో పవన్ తమ భీమ్లా నాయక్ సెట్స్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ సినిమా సెట్స్ లో అడుగు పెట్టారని టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతే కాకుండా పవన్, ప్రభాస్ మరియు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ లతో కలిసి కాసేపు మాట్లాడారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ విస్తృతంగా ఇప్పుడు వైరల్ అవుతుంది.

మరి ఇందులో ఎంతమేర నిజముందో చూడాలి. మరి ఇదిలా ఉండగా ఆల్రెడీ ప్రభాస్ సినిమా కోసం భారీ సెట్టింగ్స్ వేశారని అందుకే ఫోటోలు బయటకి రాలేదు అనే టాక్ కూడా ఉంది. కానీ ఈ ముగ్గురు లెజెండ్స్ ని ఓకే ఫ్రేమ్ లో చూడాలని చాలా మందే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :