“దళపతి 67” లో ప్రేమమ్ హీరో..?

“దళపతి 67” లో ప్రేమమ్ హీరో..?

Published on Oct 30, 2022 8:11 PM IST


ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మంచి హైప్ ఉన్నటువంటి పలు సెన్సషనల్ కాంబోస్ లో దళపతి విజయ్ మరియు టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ రాజ్ ల కాంబో కూడా ఒకటి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి ఆల్రెడీ వచ్చిన చిత్రం “మాస్టర్” తో అదరగొట్టారు. ఇక ఈ చిత్రం తర్వాత లోకేష్ నుంచి లోకి సినిమా యూనివర్స్ స్టార్ట్ కాగా దాని తర్వాత విజయ్ తో సినిమా అనౌన్స్ చెయ్యడంతో దానిపై భారీ హైప్ సెట్టయ్యింది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తుంది. ఈ చిత్రంలో కీలక పాత్రకి గాను ఒరిజినల్ వెర్షన్ “ప్రేమమ్” హీరో నివిన్ పౌలే నటించనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ టాక్ మంచి ఆసక్తిగా అయితే మారింది. ఇక అలాగే దీనిపై అధికారిక క్లారిటీ కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించనుండగా ఈ డిసెంబర్ లో అయితే ఈ సినిమాపై ఓ సాలిడ్ అప్డేట్ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు