ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్?

Published on Nov 24, 2021 3:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో అల్లు అర్జున్ ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

అయితే ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం నుండి ఇక ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది. ఈ ట్రైలర్ ను డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.

పాన్ ఇండియా మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతుండటం తో బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా తో కలిసి నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :