“పుష్ప” సెకండ్ సింగిల్ ఈ స్టార్ సింగర్ తోనేనా.?

Published on Sep 24, 2021 9:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రష్మికా మందన్నా హీరోయిన్ గా ప్రస్తుతం “పుష్ప” అనే భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం నుంచి ఇప్పుడు వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. మరి వాటిలో దీని ఫస్ట్ సింగిల్ కూడా ఒకటి.

ఇక దీని తర్వాత అంతా సెకండ్ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఆల్రెడీ దీనికోసం ముందే సమాచారం బయటకి వచ్చేసింది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్ అని బన్నీ, రష్మికా ల మధ్య ఉండే సాంగ్ అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యాజికల్ వాయిస్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ తో కలిసి ఓ సాంగ్ ని రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది.

ఆ సంబంధిత ఫోటోలే ఇప్పుడు వైరల్ అవుతుండగా ఇది పుష్ప సాంగ్ కోసమే అని బజ్ వినిపిస్తుంది. మరి ఒకవేళ పుష్ప కే అయితే అది సెకండ్ సింగిల్ కా వేరేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వాటిలో ఒకటి ఈ ఏడాది క్రిస్మస్ రేస్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :