“పుష్ప” షూట్ మరింత ఆలస్యం..కారణం ఇదే.?

Published on Jul 16, 2021 1:39 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ పాన్ ఇండియన్ చిత్రం కూడా ఇటీవల షూట్ రీస్టార్ట్ చేసుకొని అంతిమ దశ షూట్ లోకి ఎంటర్ అయ్యింది. అయితే హైదరాబాద్ లో గత కొన్ని రోజులు కితమే స్టార్ట్ అయిన ఈ సినిమా మొత్తం 45 రోజులు షూట్ గా నిర్విరామంగా ప్లాన్ చేశారు.

కానీ దీనికి మళ్ళీ బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కురిసిన వర్షాల కారణంగా పుష్ప షూట్ లొకేషన్స్ పాడయ్యాయట. అందుకే ఈ చిత్రంకి మరింత విరామం మళ్ళీ వచ్చినట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :