ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి పలు సినిమాలు నేరుగా పాన్ వరల్డ్ లెవెల్ ఆడియెన్స్ అండ్ మార్కెట్ నే టార్గెట్ చేసుకొని వస్తున్న సంగతి తెలిసిందే. అలా కన్నడ రాకింగ్ స్టార్ యష్ తన టాక్సిక్ ని ఏకకాలంలో కన్నడ, ఇంగ్లీష్ లో తెరకెక్కించి బిగ్ స్టెప్ తీసుకోవడమే కాకుండా హోలీవుడ్ కి చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్/నిర్మాణ సంస్థ లయన్స్ గేట్ వారిని పట్టాడు.
ఇక ఈ సినిమా కాకుండా తను నిర్మాణం వహిస్తున్న మరో భారీ సినిమా రామాయణ కి కూడా మేకర్స్ మరో పాపులర్ సంస్థ సోనీ ఇంటర్నేషనల్ పిక్చర్స్ తో కలిశారు. ఇక ఇప్పుడు ఇదే బాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా రాకా కూడా వెళుతుంది అని తెలుస్తోంది. ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ తో రాకా రాబోతున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇది డిస్ట్రిబ్యూషన్ పరంగనా లేక హాలీవుడ్ నటుడు ఎంట్రీ కూడా ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రముఖ నటుడు విల్ స్మిత్ ఈ సినిమాలో కనిపించే అవకాశం ఉందని ఎప్పుడు నుంచో పుకార్లు ఉన్నాయి. సో వీటిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
