లేటెస్ట్..”రాధే శ్యామ్” ఫీస్ట్ ఫిక్స్ అయ్యిపోయిందా.?

Published on Oct 10, 2021 2:00 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చే ప్రభాస్ బర్త్ డే కానుకగా ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సమాధానంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలే వినిపిస్తున్నాయి..

కానీ ఏది ఫిక్స్ అయ్యింది అన్నది మాత్రం ఇంకా గోప్యంగానే ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్స్ ఫస్ట్ సింగిల్ మరియు టీజర్ ల కోసమే ఎదురు చూస్తుండగా వచ్చే ప్రభాస్ బర్త్ డే కి టీజర్ ఫిక్స్ అయ్యినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనికి ఇంకాఆ రెండు వారాలు కూడా గడువు లేదు మరి ఈ గ్యాప్ లో ఏమన్నా అనౌన్సమెంట్స్ వస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :