రాధే శ్యామ్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

Published on Sep 10, 2021 9:53 pm IST


ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా రాధ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదల కి సంబంధించి ఇప్పటి వరకు చాలానే వార్తలు వచ్చాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణం గా పలు సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సినిమాలు సైతం తమ విడుదల తేదీలను వాయిదా వేశాయి. అందులో రాధే శ్యామ్ కూడా ఉందని చెప్పాలి.

అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్నట్లు సమాచారం. యూ వీ క్రియేషన్స్ మరియు టీ సీరీస్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :