‘మహేష్ సినిమా’ డిటైల్స్ పై రాజమౌళి స్పందన ?

Published on Dec 20, 2021 7:32 pm IST

నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చింది. అయితే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? ఇది కూడా పాన్ ఇండియా సినిమానా ? అసలు సినిమా రిలీజ్ టార్గెట్ ఏమిటి ? లాంటి విషయాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ, ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయితే గానీ, మహేష్ సినిమా డిటైల్స్ గురించి ఆలోచించను అని ఇప్పటికే రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. అయితే, ఆర్ఆర్ఆర్ జనవరి 7న రిలీజ్ కాబోతుంది. కాబట్టి.. ఆ తర్వాత అయినా మహేష్ సినిమా డిటైల్స్ ను రాజమౌళి రివీల్ చేస్తాడేమో చూడాలి. ఇక ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్‌ మహేశ్‌ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాశారట.

ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :