సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అనేకమంది అగ్ర తారాగణం కలయికలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం జైలర్ 2 కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి వచ్చే నెల రాబోతుంది. అయితే జైలర్ పార్ట్ 1 హిట్ అయ్యాక అఫీషియల్ గానే మేకర్స్ జైలర్ 2 అంటూనే అనౌన్స్ చేసి ఇప్పుడు వరకు అప్డేట్స్ కూడా ఇచ్చారు.
కానీ లేటెస్ట్ గా ఈ సినిమా టైటిల్ జైలర్ 2 నుంచి ‘రజిని: ది జైలర్ 2’ గా మారడంతో ఫ్యాన్స్ గందరగోళం వ్యక్తం చేస్తున్నారు. బుక్ మై షోలో అఫీషియల్ టైటిల్ జైలర్ 2 తో వెతికితే రెండు వెర్షన్ లు వస్తున్నాయి. అయితే వీటిలో ఒరిజినల్ కి తమిళ్, తెలుగు ఇతర వెర్షన్ లు వస్తే రజిని ది జైలర్ కి హింది వెర్షన్ గా కనిపిస్తుంది.
అలాగే దీనికి 85 వేల మేర ఇంట్రెస్ట్ లు ఉంటే మిగతా వెర్షన్ లకి వంద కూడా లేవు. దీనితో మొదటి నుంచీ ఉన్నదాన్ని బుక్ మై షో యాజమాన్యం మార్చేసి ఇప్పుడు ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు అని సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని బుక్ మై షో సరి చేస్తుందో లేదో చూడాలి.
