మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే పెద్ది (Peddi). భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. అయితే ఈ సినిమాను మేకర్స్ మార్చ్ 27కి ప్రామిస్ చేశారు కానీ ఇప్పుడు మారుతున్న సమీకరణాలు చూస్తుంటే పెద్ది ఆ డేట్ లో వచ్చే సూచనలు కనపడటం లేదు.
ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా అందుకు ప్రిపేర్డ్ గానే కనిపిస్తున్నారు. దీనితో కొత్త డేట్ ఏంటి అనేది కూడా ఇప్పుడు వినిపిస్తోంది. దీని ప్రకారం మే 1 లేదా ఏప్రిల్ చివరలో సినిమా విడుదల ఉండొచ్చు అంటూ కొత్త బజ్ మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే కూడా మరి అంత స్పెషల్ డేట్ ని వదులుకుంటారా లేక ఆన్ టైం వస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
