టాక్..”రామబాణం” ఓటిటి డేట్ ఫిక్స్.?

Published on May 24, 2023 8:00 am IST

మన టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా డింపుల్ హయాతి హీరోయిన్ దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “రామబాణం” కోసం తెలిసిందే. రీసెంట్ బజ్ మధ్య అయితే వచ్చిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ విజయాన్ని అయితే సాధించలేదు. దీనితో గోపిచంద్ కెరీర్ లో మరో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు అయితే ఓటిటి డెబ్యూ ఇవ్వడనికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లివ్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ తో పాటుగా జగపతిబాబు, ఖుష్బూ తదితరులు కూడా కీలక పాత్రల్లో నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడని అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు అయితే నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :