రాంగ్ డేట్ ఎంచుకున్న ‘రామాయణ’ మేకర్స్? ‘గాడ్జిల్లా’ ఎఫెక్ట్.. బడ్జెట్ 125 కోట్లే కానీ హైప్ నెక్స్ట్ లెవెల్!

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలకి రాబోతున్న భారీ చిత్రమే ‘రామాయణ’. రెండు భాగాలుగా ఏకంగా 4000 కోట్ల బడ్జెట్ అంటూ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఖరారు చేశారు. అయితే ఇన్ని రోజులు దీపావళి రిలీజ్ అనే తెలుసు కాబట్టి వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర రామాయణ డేట్ పై క్లారిటీ లేదు.

కానీ ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ తో ఊహించని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇది వరకే రామాయణ రిలీజ్ సమయంలోనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో క్లాష్ ఉంటుంది అని తెలిపాము. అదే జపాన్ సినిమా నుంచి రాబోతున్న ‘గాడ్జిల్లా మైనస్ జీరో’. దీనికి ముందు వచ్చిన పార్ట్ 1 వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర పెను సంచలనం సెట్ చేసింది.

కేవలం 100 కోట్ల బడ్జెట్ లోనే తెరకెక్కించిన ఆ సినిమాకి ఆస్కార్ కూడా వచ్చింది. మరి అదే దర్శకుడు తెరకెక్కించిన పార్ట్ 2 నే ‘గాడ్జిల్లా మైనస్ జీరో’. దీనిపై కూడా హైప్ భారీ లెవెల్లో ఉంది. పైగా దీనిని కూడా రామాయణ లానే ఐమ్యాక్స్ వెర్షన్ లోనే పూర్తిగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని జపాన్ లో నవంబర్ 3న ఇతర దేశాల్లో ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్ లో నవంబర్ 6న విడుదల చేస్తున్నట్టు ఖరారు చేశారు.

సరిగా ఇదే డేట్ లో రామాయణ అనౌన్స్ అయ్యింది. సో డెఫినెట్ గా గాడ్జిల్లా ఎఫెక్ట్ మాత్రం దీనిపై పడడం గ్యారెంటీ. పార్ట్ 2 కేవలం 125 కోట్ల బడ్జెట్ లోనే తీస్తున్నారట. అయినప్పటికీ ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువే ఉన్నాయి. సో రామాయణ మేకర్స్ డేట్ పరంగా రాంగ్ స్టెప్ తీసుకున్నారా అనుకోవాలి. గాడ్జిల్లా తో పోలిస్తే ప్రపంచ మార్కెట్ లో హైప్, బజ్ పరంగా రామాయణ వెనుకబడే ఉంది. వీటితో ఈ రెండు సినిమాల క్లాష్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Exit mobile version