ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలకి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతా రాములుగా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన భారీ ఇతిహాస కావ్యం ‘రామాయణ’ కూడా ఒకటి. తెలుగులో ‘రామాయణం’ గా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ పట్ల మంచి ఆసక్తి అందరిలో నెలకొంది.
నిజానికి మొన్ననే విడుదల కావాల్సిన ఈ ట్రైలర్ ని మేకర్స్ వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా కొత్త డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం డిజిటల్ గా ఈ ట్రైలర్ జూలై 30న విడుదల కాబోతుంది అని ఇప్పుడు తెలుస్తుంది. ఇది పక్కన పెడితే మొన్న కామిక్ కాన్ ఈవెంట్ నుంచి మొదటి నిమిషమున్నర ట్రైలర్ లీక్ అయితే ఇప్పుడు మరో షాకింగ్ లీక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో విజువల్స్ చూసి ఫ్యాన్స్, ఆడియెన్స్ షాకవుతున్నారు. సో ఈ ట్రైలర్ మీద అంచనాలు ఇపుడు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకి హన్స్ జిమ్మర్, రెహమాన్ లు సంగీతం అందిస్తుండగా నమిత్ మల్హోత్రా నిర్మాణం వహిస్తున్నారు.
