టాక్..అవైటెడ్ “ఆదిపురుష్” టీజర్ కి డేట్ ఫిక్స్.?

Published on Sep 13, 2022 10:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా నుంచి వరల్డ్ లెవెల్లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని మేకర్స్ నెక్స్ట్ లెవెల్లో సిద్ధం చేస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ టీజర్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి ఇప్పుడు బయటకి వచ్చింది.

ప్రభాస్ ఈ ఏడాది ఢిల్లీ లో జరిగే ప్రతిష్టాత్మక దసరా మహోత్సవాలు లో పాల్గొనడం కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ వేడుకల సమయంలోనే ఆదిపురుష్ టీజర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి దీనిపై అయితే ఆ డేట్ కి సంబంధించి అధికారిక అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాలో అయితే కృతి సనన్ హీరోయిన్ గా నటించగా వచ్చే ఏడాది భారీ లెవెల్లో జనవరి 12న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :