కార్తీ “జపాన్” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారా?

Published on Mar 10, 2023 8:01 am IST


మన తెలుగు సినిమా దగ్గర కూడా మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోస్ లో నటుడు కార్తీ కి కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తన లాస్ట్ చిత్రం “సర్దార్” తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా సాలిడ్ వసూళ్లు అందుకొని తన కెరీర్ లో మరో మంచి హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత అయితే కార్తీ హీరోగా దర్శకుడు రాజు మురుగన్ తో అనౌన్స్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “జపాన్”.

ఈ సినిమాకి కార్తీ సరికొత్త మేకోవర్ లోకి మారగా మేకర్స్ అయితే ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టుగా టక వినిపిస్తుంది. ఈ సినిమాని మేకర్స్ అయితే ఈ జూన్ 29 న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :