“కేజీయఫ్ చాప్టర్ 2″కు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా.?

kgf

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ మీదకు దండయాత్ర చెయ్యడానికి రెడీగా ఉన్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంపై తారా స్థాయి అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. మరి అలాగే ఈ భారీ చిత్రం నుంచి వచ్చిన లేటెస్ట్ టీజర్ తో అయితే అవి ఆ హద్దులను కూడా దాటేశాయి.

మరి టీజర్ అయితే వచ్చింది ఇక సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈ పాటికే విడుదల కావాల్సి ఉన్న ఈ భారీ చిత్రానికి ఒక డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాను మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చే జూలై 30న గ్రాండ్ రిలీజ్ చెయ్యాలి అన్నట్టుగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మాత్రం ఎప్పుడు విడుదల అయినా కనీ వినీ ఎరుగని ఫిగర్స్ ను మొట్ట మొదటి రోజు ఇండియన్ సినిమా వద్ద నమోదు చెయ్యడం ఖాయం అని చెప్పాలి.శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి అగ్ర తారాగణంతో తెరకెక్కింది. అలాగే హోంబలే పిక్చర్స్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.

Exit mobile version