“RRR” బిగ్ బ్లాస్ట్ ఆ రోజుకి ఉందా..?

“RRR” బిగ్ బ్లాస్ట్ ఆ రోజుకి ఉందా..?

Published on Oct 22, 2021 4:39 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “రౌద్రం రణం రుధిరం”. పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఒకపక్క పాటల రికార్డింగ్ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పనులను శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఇదే సమయంలో ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందా అనే ఊహాగానాలు అయితే మొదలయ్యాయి.

ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ టీజర్ బ్లాస్ట్ ని ఈ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇంకా చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఎలాంటి మూమెంట్ లేదు కాబట్టి తక్కువ అంచనాలతోనే ఎదురు చూస్తే మంచింది. అసలే జనవరి రిలీజ్ అప్డేట్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయో కూడా చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు