టాక్..”సలార్” అప్డేట్ అప్పటికి పోస్ట్ పోన్ అయ్యిందా.?

Published on May 24, 2022 7:57 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో పాన్ ఇండియా వైడ్ సాలిడ్ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం “సలార్” కూడా ఒకటి. సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ నుంచి మన ఇండియన్ సినిమా దగ్గర మరో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే తారా స్థాయిలో ఉన్నాయి.

ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూట్ ప్రోగ్రెస్ లో ఉండగా గత కొంత కాలం నుంచి ఈ చిత్రం మాసివ్ టీజర్ లేదా గ్లింప్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇది నిజానికి ఈ మే లోనే రావాల్సి ఉన్నా అనూహ్యంగా ఇది ఇప్పుడు వాయిదా పడినట్టు టాక్ వినిపిస్తుంది.

మరి దీనిని ఈ జూన్ నెలలో రివీల్ చేస్తారన్న బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. అయితే ఈ అప్డేట్ కోసం అయితే అభిమానులు చాలా కేజ్రీగా ఎదురు చూస్తున్నారు. మరి అది అప్పుడైనా వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :