“సలార్” రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ ఆరోజే?

Published on Sep 26, 2023 4:06 pm IST

ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా వైడ్ గా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న భారీ సినిమా పేరు “సలార్”. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ చిత్రమే ఇది. మరి అనౌన్స్ చేసిన నాటి నుంచే ఓ రేంజ్ లోకి వెళ్లిన ఈ చిత్రం ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గరకి వచ్చేసరికి పోస్ట్ పోన్ లు కొత్త రిలీజ్ డేట్ విషయంలో ట్విస్ట్ లు చాలానే నడిచాయి.

ఇక ఫైనల్ గా ఇప్పుడిప్పుడే సాలిడ్ బజ్ లు రిలీజ్ పై క్లారిటీ తీసుకొస్తున్నాయి. మరి ఈ సరికొత్త రిలీజ్ డేట్ ఎపుడు వస్తుంది అనే దానిపై లేటెస్ట్ ఇన్ఫో ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సెప్టెంబర్ 29న అనౌన్స్ చేయనున్నారని టాక్. ఇప్పటికే 28 డేట్ న రావాల్సిన ఈ సినిమా ఈ నెక్స్ట్ డేట్ లో అయితే కొత్త రిలీజ్ డేట్ ని రివీల్ చేయబోతుంది. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :