పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా అది కూడా ఫ్రాంచైజ్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరి ఈ భారీ సినిమా కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా వాయిదా పడింది అనే అనధికారిక వార్తలు అయితే ఇపుడు వైరల్ గా మారాయి.
దీనితో ఒక్కసారిగా అంతా మారిపోగా ఇప్పుడు సలార్ సరికొత్త డేట్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం సలార్ కి దీపావళి డేట్ ని అయితే మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియా రిలీజ్ కి అయితే ఇదే కరెక్ట్ సమయం అని మేకర్స్ భావిస్తున్నారట. దీనితో అయితే నవంబర్ 3 లేదా నవంబర్ 10 కి అలా సినిమాని దింపే ప్రయత్నం చేస్తున్నట్టుగా టాక్. మరి దీనిపై అసలు క్లారిటీ రావాల్సి ఉంది.