శంకర్ కంబ్యాక్.. ఈ ఒక్కటీ అంచనాలు అందుకుంటే సరిపోతుంది

శంకర్ కంబ్యాక్.. ఈ ఒక్కటీ అంచనాలు అందుకుంటే సరిపోతుంది

Published on Jul 11, 2024 8:00 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర రిలీజ్ కి వస్తున్నా మరో అవైటెడ్ సినిమానే “ఇండియన్ 2”. మరి తెలుగులో “భారతీయుడు 2” గా మావెరిక్ దర్శకుడు శంకర్ నుంచి అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ల కాంబినేషన్ నుంచి ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నా సినిమా కావడంతో శంకర్, కమల్ అభిమానుల్లో ఈ చిత్రానికి ప్రత్యేక చోటు ఉంది.

అయితే ఈ సినిమాపై నిజానికి ఉండాల్సిన రేంజ్ బజ్ కానీ అంచనాలు కానీ ఆడియెన్స్ లో లేవు. అసలు ఒకప్పుడు శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ హైప్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఈ చిత్రం చాలా తక్కువ బజ్ లోనే వస్తుంది. మరి ఈ సినిమాతో శంకర్ కం బ్యాక్ ఇస్తారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది.

అయితే శంకర్ సినిమాలు అంటే అబ్బురపరిచే విజువల్స్, సాంగ్స్, యాక్షన్ బ్లాక్ లు తప్పకుండా ఆశిస్తారు. కానీ వీటితో పాటుగా తన ప్రతి సినిమాలో తన మార్క్ ఎమోషన్స్ కూడా బిగ్గెస్ట్ హైలైట్ గా నిలుస్తాయి. ఉదాహరణకి భారతీయుడు ప్రీక్వెల్ లోనే ఎన్నో అద్భుతమైన ఎమోషనల్ సీన్స్ ని కమల్ తో శంకర్ తెరకెక్కించారు.

మరి మళ్ళీ ఆ రేంజ్ ఎమోషన్స్ భారతీయుడు 2 లో కూడా ఉంటే తప్ప సినిమా ఫలితం పాజిటివ్ గా వచ్చే ఛాన్స్ లేదని చెప్పక తప్పదు. మరి దీనికి కారణం కూడా శంకర్ అనే చెప్పాలి. తన సినిమాల్లో ఎమోషన్స్ కి ఆ రేంజ్ స్టాండర్డ్స్ ని తాను సెట్ చేశారు. మరి వీటిని కానీ మ్యాచ్ చేస్తే మాత్రం భారతీయుడు 2 కి పెద్ద ప్లస్ అవుతుంది అని చెప్పొచ్చు. మరి ఈసారి శంకర్ ఎలాంటి ఎమోషన్స్ ని డిజైన్ చేసారో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు