టాక్..ఏపీలో “కేజీయఫ్ 2” కూడా ధరలు పెరగనున్నాయా.?

Published on Apr 7, 2022 7:45 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ లేటెస్ట్ సినిమాని ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించి రిలీజ్ కి సిద్ధం చేశారు.

అయితే ఒకింత కన్నడ కన్నా మన తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. దీనితో మన దగ్గర థియేట్రికల్ హక్కులని కూడా భారీ డిమాండ్ నెలకొనగా దీనితో ఈ చిత్ర యూనిట్ కూడా స్పెషల్ హైక్స్ కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏపీలో కాస్త పరిస్థితులు విభిన్నంగా ఉన్న సంగతి తెలిసిందే.

కొత్త జివో లు కొత్త రూల్స్ తో కొన్ని తెలుగు సినిమాలకే స్పెషల్ పర్మిషన్స్ డౌట్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా ఎంత పాన్ ఇండియా సినిమా అయినా ఏపీలో కొత్త జివో ప్రకారం అనుమతులు వస్తాయా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో కేజీయఫ్ సినిమాకి గాను ఒక 50 రూపాయల మేర హైక్ కోసం మేకర్స్ ఏపీ ప్రభుత్వంకి రిక్వెస్ట్ పెట్టనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అసలైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :