గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే మరో టాలెంటెడ్ హీరోయిన్ అంజలి కూడా నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ ప్రమోషన్స్ ని కూడా చేసుకుంటూ ఉండగా మొదటిసారిగా యూఎస్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోడానికి సిద్ధంగా ఉంది.
మరి ఈ ఈవెంట్ ని డిసెంబర్ 21 కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కోసం గ్రాండ్ ప్లానింగ్ లు చేస్తుండగా ఈ ఈవెంట్ కోసం ప్రముఖ దర్శకుడు లేటెస్ట్ గా పుష్ప 2 తో భారీ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్ హాజరు కానున్నట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాలి. ఇపుడు పుష్ప 2 తర్వాత సుకుమార్ పుష్ప 2 తర్వాత ఖాళీగా మారిన సంగతి తెలిసిందే. అలాగే చరణ్ తో సుకుమార్ నెక్స్ట్ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.