ఈ స్టార్ డైరెక్టర్ తో సూర్య సినిమా ఆగిపోలేదా? లేటెస్ట్ టాక్ ఏమిటంటే!

Published on May 25, 2022 8:00 am IST


స్టార్ హీరో సూర్య కి మన తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సూర్య నటించిన ఎన్నో సినిమాలు మన దగ్గర భారీ హిట్స్ అయ్యాయి. అయితే సూర్య చేసిన దర్శలుకుల్లో స్టార్ దర్శకుడు బాల తో అంటే ఆ కాంబినేషన్ పై సాలిడ్ అంచనాలు ఉంటాయి. అందుకే మళ్లీ చాలా కాలం అనంతరం సూర్య కెరీర్ లో 41వ సినిమాగా ఈ బిగ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చెయ్యగా అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాపై తాజాగా ఓ అనుకోని టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఈ సినిమా పలు కారణాల చేత ఆగిపోయింది అని మళ్ళీ స్టార్ట్ అవ్వదు అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తమిళ సినీ వర్గాలు నుంచి మరో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అయితే ఆగలేదని కానీ సూర్య కెరీర్ లో 41 నుంచి 43 వ సినిమాగా పుష్ అయ్యింది అంటూ టాక్ వినిపిస్తుంది. మరి వీటిలో ఎంతమేర నిజముందో చూడాలి. అలాగే ప్రస్తుతం అయితే అభిమానులు ఒక క్లారిటీ కోసం ఈ సినిమాపై ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :