ఎన్నిసార్లయినా ప్రేమలో పడొచ్చు – తమన్నా

సీనియర్ హీరోయిన్ తమన్నా పెళ్లి, ప్రేమ వ్యహావరాల పై ఎప్పుడూ ఏవో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే, తన వ్యక్తిగత ఒంటరి జీవితానికి సంబంధించి తమన్నా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. తాజాగా మళ్లీ ప్రేమ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జీవితంలో ఎన్నిసార్లయినా ప్రేమలో పడే అవకాశం ఉందని, అది కేవలం ఒక్కరికే పరిమితం కావాల్సిన అవసరం లేదంటూ తాజాగా తమన్నా కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

పైగా బంధాలు మనల్ని బంధించేవిగా ఉండకూడదని, మన ఎదుగుదలకు తోడ్పడేలా ఉండాలని.. అలాంటి బంధం దొరికే వరకూ కొత్త బంధాలను వెతుక్కోవాలి అన్నట్టు తమన్నా చెప్పడం విశేషం. మొత్తానికి విజయ్ వర్మతో విడిపోయిన తర్వాత తమన్నా చేసిన ఈ కామెంట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతానికి తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ తమన్నా క్లారిటీ ఇచ్చింది.

Exit mobile version